నవతెలంగాణ – హైదరాబాద్
తెలుగు రాష్ట్రాల్లో 20కి పైగా స్టోర్లతో రిటైల్ మొబైల్ విక్రయాల్లో దూసుకుపోతున్న బిగ్ సి దసరా సందర్భంగా ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటించింది. ఈ సందర్భంగా సంస్థ సిఎండి యం.బాలు చౌదరి మాట్లాడుతూ, ప్రతి స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై రూ.10వేల వరకు క్యాష్ బ్యాక్‌తో పాటు రూ.4వేల విలువైన గ్యారెంటీ బహుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఈ ధమాకా ఆఫర్ల లో ప్రతి స్మార్ట్ ఫోన్ , టివి, ల్యాప్ టాప్ కొనుగోలుపై స్మార్ట్ వాచ్ ఆఫర్, 5శాతం ఇన్స్‌టెంట్ డిస్కౌంట్ ఆఫర్, లాయల్టీ పాయింట్స్ ఆఫర్, వన్ ప్లస్ వన్ ఎక్స్‌టెండ్ వారెంటీ ఆఫర్, స్మార్ట్ టివి ఆఫర్‌లాంటి ఎన్నో ఆఫర్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు. బజాజ్ ఫైనాన్స్ ద్వారా షాపింగ్ చేసేవారికి, ఎటిఎం కార్డు వినియోగించేవారికి ఎటువంటి వడ్డీ లేకుండా ఆకర్షణీయమైన ధరలు అందుబాటులో ఉన్నాయని సిఎండి పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.