Thursday, August 27, 2026
E-PAPER
Homeఖమ్మంఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి

ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట 
ఆచార్య కొత్తపల్లి జయశంకర్ (1934–2011) 92 వ జయంతి ని గురువారం అశ్వారావుపేట లోని పలు కార్యాలయాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ కార్యాలయంలో ఆర్ఐ పద్మావతి, మున్సిపల్ కార్యాలయంలో కమీషనర్ దిలీప్ రెడ్డి లు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి సిద్ధాంతకర్తగా, విద్యావేత్తగా, సామాజిక చైతన్యవంతులు గా చిరస్మరణీయుడు అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దాదాపు ఆరు దశాబ్దాల పాటు నిరంతరం కృషి చేశారు. కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతిగా సేవలందించారు తెలిపారు. తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో జరిగిన అన్యాయాలను ఆధారాలతో వివరిస్తూ ప్రజల్లో చైతన్యం కల్పించారు. ఆయన సేవలకు గుర్తింపుగా తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఆగస్టు 6న ఆయన జయంతిని రాష్ట్ర అధికారిక వేడుకగా నిర్వహిస్తోంది అని తెలిపారు. 

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ ఛైర్పర్సన్ జూపల్లి రమేష్ బాబు, కాంగ్రెస్ జిల్లా, మండల నాయకులు తుమ్మ రాంబాబు,చిన్నంశెట్టి సత్యనారాయణ, తహశీల్దార్ కార్యాలయం సిబ్బంది ఎస్ఏ లు, లక్ష్మయ్య,సంపత్,అటెండర్ భవాని తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -