నవతెలంగాణ – పరకాల
పరకాల పురపాలక సంఘం కార్యాలయంలో గురువారం ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పురపాలక సంఘం చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి సిద్ధాంతపరమైన పునాదులు వేసిన మహోన్నత వ్యక్తిగా ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు.
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, స్వాభిమానం, హక్కుల సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ చేసిన త్యాగాలు, అందించిన మార్గదర్శకత్వం చిరస్మరణీయమని పేర్కొన్నారు. అనంతరం చైర్మన్, వైస్ చైర్‌పర్సన్, మున్సిపల్ కమిషనర్ పోతూరాజు పవన్, ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యాలయ సిబ్బంది కలిసి ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో వైస్ చైర్‌పర్సన్ ఏకు దివ్య, వార్డు కౌన్సిలర్లు దుబాసి వెంకటస్వామి, బెజ్జంకి పూర్ణదారి, గుడెల్లి సదన్ కుమార్, కుక్కల విజయ్ కుమార్, కొయ్యడ శ్రీనివాస్, పాలకుర్తి శ్రీనివాస్, సూదమళ్ల రమేష్, అల్లె దశరథం, పురప్రముఖులు బొచ్చు బాబురావు, ఏకు విద్యాసాగర్, ఆకుల శ్రీధర్, బొచ్చు జాన్సన్, బొచ్చు సల్మాన్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



