ఘనంగా డిప్యూటీ సీఎం జన్మదిన వేడుకలు..

నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క జన్మదిన సందర్భంగా మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో గల ఆదర్శ పాఠశాలలో విద్యార్థుల మధ్య కేక్ కటింగ్ నిర్వహించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామచంద్రారెడ్డి, వాసు రెడ్డి, బాయిని విఠల్, లక్ష్మణ్, షాహిద్ పాషా,  ఇమామ్, శేఖర్, ఫారూఖ్ సాబ్, నరసింహారెడ్డి, దివిటి కిష్టయ్య,  హనుమాన్లు,  సాయ గౌడ్ ,శ్రీనివాస్ గౌడ్, భాషూమియా కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Spread the love