కేసీఆర్ పై నమ్మకం ఉంటే బీఆర్ఎస్ కు ఓటేయండి. లేదంటే కాంగ్రెస్ కు వేయండి..

– మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి..

నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
కేసీఆర్ పై నమ్మకం ఉంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ ను గెలిపించాలని నమ్మకం లేకుంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి అని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పై నమ్మకం ఉంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ కు ఓటు వేసి ఎంపీగా గెలిపించాలని కేసీఆర్ పై నమ్మకం లేకుంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఆయన అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని నమ్మి ప్రజలు ఓటు వేయడం జరిగిందని 6 గ్యారంటీ ల పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తుందని ఆయన అన్నారు. ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదని ఆయన అన్నారు. ఆగస్టు 15 కల్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు లక్షల రుణమాఫీ చేస్తే తన ఎమ్మెల్యే పదవి ఈ రాజనామా చేస్తా అని హరీష్ రావు సవాల్ విసిరిన విషయం పోచారం శ్రీనివాస్ రెడ్డి గుర్తు చేశారు.  గత పది సంవత్సరాలుగా బీబీ పాటిల్ జహీరాబాద్ పార్లమెంట్లు ఎలాంటి అభివృద్ధి చేయలేదని అంతకుముందు ఎంపీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ గారు కూడా జహీరాబాద్ పార్లమెంటుకు ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఆయన అన్నారు.  పాలిచ్చే బర్రెను విడిచిపెట్టి దున్నపోతును తీసుకొచ్చి కట్టేసుకున్నట్టు ఉందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలు మరోసారి ఆలోచించి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గాలి ఉన్న అనిల్ కుమార్ కు ఓటు వేసి గెలిపించాలని ఆయన అన్నారు.  ఈ సందర్భంగా ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సురేందర్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే మదన్ మోహన్ రవు ఎల్లారెడ్డిని ఎలాంటి అభివృద్ధి చేయడం లేదని కేవలం పబ్బులకు షికారులకు మాత్రమే తిరుగుతున్నాడని ప్రజలను ఏమాత్రం పట్టించుకోవడంలేదని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని ఆయన అన్నారు. రైతుబంధు రైతు బీమా కల్యాణ లక్ష్మి వంటి పథకాలు కేసీఆర్ అమలు చేయడం జరిగిందని ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ పథకాలను అమలు చేయడం లేదని ఆయన ధ్వజమెత్తారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే జనార్దన్ గౌడ్ తో పాటు సీనియర్ నాయకులు ప్రతాపరెడ్డి బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సిద్దయ్య తో పటు ఆయా గ్రామాల మాజీ సర్పంచులు ఎంపీటీసీలు పాల్గొన్నారు.
Spread the love