నవతెలంగాణ – హైదరాబాద్: ప్రముఖ లగ్జరీ వాహనాల తయారీ కంపెనీ BMW ఇండియాలో కొత్తగా ఈవీ కారును విడుదల చేసింది. దీని పేరు i5 M60 xDrive ఎలక్ట్రిక్ సెడాన్. ప్రారంభ ధర రూ.1.20 కోట్లు (ఎక్స్-షోరూమ్). ఈ మోడల్ స్పోర్టియర్ లుక్‌ను కలిగి ఉంది. 5 సరీస్‌లో ఈ మోడల్ అత్యాధునిక ఫీచర్లను కలిగి ఉందని కంపెనీ తెలిపింది. ఇది 3.8 సెకన్లలో గంటకు 0-100 కి.మీ వేగాన్ని అందుకోగలదు. ఒక్కచార్జింగ్‌తో 516 కి.మీల దూరం ప్రయాణిస్తుందని అధికారులు వివరించారు. గరిష్టంగా 230 కి.మీల వేగంతో ప్రయాణిస్తుంది.