
సీఎం రేవంత్ రెడ్డి , మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో హుస్నాబాద్ బీజేపీ ఇంచార్జ్ బొమ్మ శ్రీరాం చక్రవర్తి సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఏఐసిసి ఇంఛార్జి సెక్రటరీ రోహిత్ చౌదరి, సీఎం ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఏఐసిసి ఇన్చార్జిని కలిసిన మంత్రి పొన్నం
ఏఐసిసి ఇంఛార్జి దీపాదాస్ మున్షిని సోమవారం మంత్రి పొన్నం ప్రభాకర్ మర్యాద పూర్వకంగా కలిశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన హుస్నాబాద్ బీజేపీ కంటెస్టెడ్ బొమ్మ శ్రీరాం చక్రవర్తి తో పాటు ముఖ్య నేతలను ఏఐసిసి ఇంచార్జి దీపాదాస్ మున్షి వద్దకు తీసుకెళ్లి పరిచయం చేశారు. బొమ్మ శ్రీరాం చక్రవర్తి తో పాటు ముఖ్య నేతలకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.