అవినీతి పాలనాంతం, బీజేపీకి అధికారం..

– బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డీ మోహన్ రెడ్డి..

నవతెలంగాణ- రెంజల్
రాబోయే ఎన్నికలలో అవినీతి పాలనను అంతమందించి బీజేపీ పార్టీ తెలంగాణలో అధికారం వస్తుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డీ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం రెంజల్ మండలంలోని తాడు బిలోలి, బోర్గం, సాటాపూర్ గ్రామాలలో గడపగడపకు ప్రచారాన్ని నిర్వహించారు. సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ స్థానిక యువత అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్సాహంగా పనిచేస్తున్నారని, టిఆర్ఎస్ పార్టీ గద్దె దించుతామని, బోధనలో బిజెపి పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన అన్నారు. ప్రత్యేక తెలంగాణ సాధించుకున్న తర్వాత యువత తమకు ఉద్యోగాలు వస్తాయన్న ఆశలు నిరాశలుగా మిగిలాయన్నారు. 9:1/2 సంవత్సరాల టిఆర్ఎస్ పార్టీ నిరుద్యోగుల తల్లిదండ్రుల కన్నీళ్లే మిగిల్చిందని ఆయన ఎద్దేవా చేశారు. టిఆర్ఎస్ పార్టీ పూర్తిగా అవినీతి మాయమైందని ఆయన స్పష్టం చేశారు. నేడు బీజేపీ పార్టీ తెలంగాణలో చాప కింద నీరు లాగా కొనసాగుతుందని, కేంద్ర రాష్ట్ర లలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ రైతులకు ఇచ్చిన పసుపు బోర్డు హామీని ప్రధానమంత్రి తో చెప్పించడం, క్యాబినెట్లో మంజూరు చేయించడం జరిగిందన్నారు. చెరుకు ఫ్యాక్టరీలు మూతపడడంతో రైతాంగం రోడ్డున పడ్డారని, బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మూతపడ్డ పరిశ్రమలను తెరిపిస్తామని ఆయన పేర్కొన్నారు. అప్పట్లో టిఆర్ఎస్ నాయకులు 100 రోజులలో నిజం చెక్కర ఫ్యాక్టరీని తెరిపిస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయమన్నారు. టిఆర్ఎస్  పార్టీపై ప్రజలకు నమ్మకం కలగడం లేదని, ఆయన పేర్కొన్నారు. విశ్వకర్మ యోజన కింద 18 కులాలకు మూడు లక్షల రూపాయల వరకు రుణాలను ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ప్రజల డబ్బు ను గత పాలకులు దోచుకొని ముందుకు వస్తున్నారని వారిని తిప్పి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు గోపికృష్ణ, రెంజల్ మండల ఉపాధ్యక్షులు క్యాతం యోగేష్, మాజీ మండల అధ్యక్షులు మేక సంతోష్, బిజెపి మండల ప్రధాన కార్యదర్శి సంగం శ్రీనివాస్, బుజ్జి ,స్థానిక నాయకులు పార్ధ రమేష్, సంతోష్, అజయ్, తదితరులు పాల్గొన్నారు.
Spread the love