మద్నూర్ ఉమ్మడి మండల ఇన్చార్జిగా బిజెపి పరిశీలకుడు ఎస్ గోవిందు స్వామి, జ్యోతి

నవతెలంగాణ – మద్నూర్
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తలపెట్టిన మేరా భూత్ సబ్సే మజ్బుద్ కార్యక్రమానికి మద్నూర్ ఉమ్మడి మండల ఇన్చార్జిగా పరిశీలికుడుగా తమిళనాడు రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యుడు ఎస్ గోవిందు స్వామి జ్యోతి వచ్చారు. గురువారం నాడు బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆయనకు పార్టీ మండల శాఖ నాయకులు ముందుగా శాలువాతో ఘనంగా సత్కరించి సీట్లు తినిపించారు. ఈ సందర్భంగా పరిశీలికుడు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మహాజన్ సంపార్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మన ప్రధాన మంత్రి నరేంద్రమోడీ తలపెట్టిన మేర బూత్ సబ్సే మాజ్బూత్ అనే కార్యక్రమానికి తమిళనాడు రాష్ట్రం నుండి ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. అనంతరం మీడియా సమావేశంలో బూత్ స్థాయిలో పార్టీ బలోపేతం కొరకు చేయవలిసిన కార్యక్రమలు అలాగే ప్రతి గ్రామ పర్యటనలు చేసి కార్యకర్తలతో ముచ్చటించి తాగు సూచనలు సలహాలు చేయడం పార్టీని అధికారంలో కి తీసుకోని రావడమే లక్ష్యంగా పని చేస్తామని తెలియజేయడం జరిగింది.. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బి. హన్మాండ్లు.. జనరల్ సెక్రెటరీ చాట్ల హన్మాండ్లు.. బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి టీ తుకరం.. ఐటి సెల్ జిల్లా అడ్వాజర్ టీ. అజయ్ కుమార్ జిల్లా కిసాన్ మోర్చా కోశాధికారి కె యాదవ్ రావు తదితరులు పాల్గొన్నారు.

Spread the love