బీజేపీ ప్రమాదాన్ని అడ్డుకోవాలి

బీజేపీ ప్రమాదాన్ని అడ్డుకోవాలి– ఇండియా కూటమిలోని పార్టీలపై కాంగ్రెస్‌ వైఖరి ఆందోళనకరం
– కేంద్రంలో ఎవరికి మద్దతు ఇస్తారో చెప్పాలని కేసీఆర్‌కు ప్రశ్న : బీవీ రాఘవులు
– చిన్నతుండ్ల, లోయపల్లి సభల్లో పాల్గొన్న రాఘవులు
కమ్యూనిస్టులు చేసిన పోరాటాలతోనే బడుగు, బలహీన వర్గాలకు భూములు దక్కాయని సీపీఐ(ఎం) పొలిట్‌ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం చిన్నతుండ్ల, మంచాల మండలం లోయపల్లి గ్రామాల్లో సీపీఐ(ఎం) అభ్యర్థి పగడాల యాదయ్య ప్రచార సభల్లో రాఘవులు పాల్గొన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు కామ్రేడ్‌ కృష్ణమూర్తి భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడి ఎంతోమంది పేదలకు భూమిని పంచిపెట్టారని గుర్తుచేశారు. వెట్టిచాకిరీ నశించాలని, దున్నేవాడికే భూమి కావాలనే నినాదంతో కమ్యూనిస్టు పార్టీ పనిచేసిందన్నారు. కానీ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు భూ బకాసురుల్లా వాటిని లాక్కుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారిని ఓడించేందుకు.. కమ్యూనిస్టు అభ్యర్థి పగడాల యాదయ్యను గెలిపించాలని కోరారు.

Spread the love