నవతెలంగాణ- దుబ్బాక రూరల్: వచ్చే ఎన్నికల్లో మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గెలవడం ఖాయం, అన్ని సర్వేల్లో బీఆర్ఎస్ వైపే ఉన్నాయని దుబ్బాక మండల పరిశీలకులు యెల్లు రవీందర్రెడ్డి అన్నారు. ఆదివారం దుబ్బాక మండలం హబ్సిపూర్ గ్రామ బీజేపీ వార్డు మెంబర్లు దుబ్బాక మండల పరిశీలకులు యెల్లు రవీందర్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి తాము మద్దతునిస్తున్నామని వార్డ్ మెంబర్లు బిట్ల చంద్రం, బోలగం పద్మ, జోగు రత్నం, ఏర్పుల రేణుక అన్నారు. కార్యక్రమంలో జడ్పిటిసి కడతల రవీందర్ రెడ్డి, సీనియర్ నాయకులు కిషన్ రెడ్డి, బండిరాజు, కోమటిరెడ్డి రజనీకాంత్ రెడ్డి, తుమ్మ శేఖర్ తదితరులు ఉన్నారు.