బీజేపీ 400 సీట్లు సాధిస్తామనడం మోడీ మ్యాజిక్‌ డ్రామా

– అన్న ప్రసన్నం కాకుండానే శాపనార్ధాలు
– కేసీఆర్‌ ఒక మానసిక రోగి
– బీఆర్‌ఎస్‌, బీజేపీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు
– నేడు సీఎం సభ.. విజయవంతం చేయాలి
– సన్నాహక సమావేశంలో తుమ్మల
నవతెలంగాణ-ఇల్లందు
త్వరలో జగనన్న పార్లమెంట్‌ ఎన్నికల్లో 400 సీట్లు సాధిస్తామని ప్రధాని మోడీ పేర్కొనడం మ్యాజిక్‌ డ్రామా యేనని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, మహబూబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్చార్జి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో గురువారం బూత్‌ కమిటీ నేతలు, ముఖ్య కార్యకర్తలతో సన్నాక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వారు పాల్గొని ప్రసంగించారు. అసలు బీజేపీ దేశంలో 400 పార్లమెంటు స్థానాలే పోటీ చేయడం లేదన్నారు. రాష్ట్ర ప్రజలను రెండుసార్లు మోడీ మోసం చేశారని విమర్శించారు. పదేళ్ల పాలలో ఒక్క ఫ్యాక్టరీ నెలకొల్పకపోగా ఉన్న ఉన్న పరిశ్రమలను ప్రయివేటుకు దారధక్తం చేస్తున్నారని, ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలేదని, బయ్యారంకు ఫ్యాక్టరీ పై స్పందన లేదని విమర్శించారు. కలలు కనడం తప్పు కాదని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి కనీసం ఆరు నెలలు కూడా కాలేదని అన్న ప్రసన్నం కూడా కాకముందే ప్రభుత్వం కూలిపోతుందని శాపనార్ధాలు పెట్టడం సీనియర్‌ ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్‌కు సిగ్గుండాలన్నారు. కేసీఆర్ని ఒక మానసిక రోగిగా అభివర్ణించారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌లు పైకి కొట్లాడుకున్నట్లుగాలో లోపల లోపాయకారి అవగాహన జరుగుతోందన్నారు. వారిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. వర్షాభావ పరిస్థితులు, మండుతున్న ఎండలకు భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయని అన్నారు. పదేళ్లు పాలించి ప్రతి సమస్యను తమ ప్రభుత్వం పైకి నెట్టాలని చూస్తున్నారని అన్నారు. అప్పుకు అవకాశం లేకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చారని అందుకే ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా బుద్ధి రావడం లేదని విమర్శించారు.
నేడు మహబూబాబాద్‌లో సీఎం సభ విజయవంతం చేయాలి
లక్ష మందితో బలరాం నాయక్‌ నామినేషన్‌
నేడు మహబూబాబాద్‌ పార్లమెంటు స్థానానికి లక్ష మందితో కలిసి భారీ ప్రదర్శనగా బలరాం నాయక్‌ నామినేషన్‌ వేయనున్నారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల అన్నారు. భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్‌ రెడ్డి పాల్గొననున్నారని తెలిపారు. గతంలో జరిగిన సీఎం సభకు నియోజకవర్గం నుండి జన సమీకరణ జరగలేదని రిపోర్టులున్నాయని అన్నారు. మహబూబాబాద్‌లో జరిగే సభ కైనా భారీ ఎత్తున ప్రజలను, కార్యకర్తలను నాయకులను తరలించాలని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షులు డానియల్‌ అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే కోరం కనకయ్య, మున్సిపల్‌ చైర్మన్‌ డివి, మాజీ ఎమ్మెల్యే పొదం వీరయ్య, కాంగ్రెస్‌ మహిళా సంఘం అధ్యక్షురాలు దేవి ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.

Spread the love