బస్సుల సంఖ్య పెంచి ప్రజా రవాణా మెరుగుపరచాలి

– బస్సు డిపో సమస్యలపై మంత్రి తుమ్మలకు టీడీపీ బృందం వినతి
– ఎన్నికల అనంతరం పరిష్కరిస్తాం : మంత్రి తుమ్మల
నవతెలంగాణ-ఇల్లందు
ఇల్లందు బస్సు డిపోలో సమస్యలు పరిష్కరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్యకు తెలుగుదేశం పార్టీ బృందం గురువారం వినతిపత్రం సమర్పించింది. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్‌చార్జి ముద్రగడ వంశీ మాట్లాడుతూ గత ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలు హడావిడిగా బస్‌ డిపో ఏర్పాటు చేయడం జరిగిందని, కానీ అందులో సరైన సదుపాయాలు కల్పించలేదని దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలు, బస్సు డ్రైవర్లు కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, డ్రైవర్లు భోజనం చేయడానికి సరైన భోజనశాల గాని రెస్ట్‌ తీసుకోవడానికి గదులు గాని లేక ఇబ్బంది పడుతున్నారని సమస్యలు ఏకరువు పెట్టారు. అనంతరం సంబంధిత మంత్రి ద్వారా సమస్యలకు పరిస్కారం చూపుతామని మంత్రి తుమ్మల హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు చాందావత్‌ రమేష్‌ బాబు, మట్టల రత్నాకర్‌ టీఎన్‌ఎస్‌ఎఫ్‌ పట్టణ అధ్యక్షులు దాసరి గోపాలకృష్ణ ,ముక్కు శ్రీవెద్‌, తదితరులు పాల్గొన్నారు.

Spread the love