– కల్లెపల్లి ఆశీర్వాద సభలో ఎమ్మెల్యే రసమయి విజ్ఞప్తి
నవతెలంగాణ-బెజ్జంకి
మెట్టప్రాంతమైన మండలాన్ని గోదారి నీళ్లతో సస్యశామలం చేశానని..బురదరోడ్లతో దర్శనమిచ్చిన గ్రామీణ రోడ్లన్ని సీసీ రోడ్లతో, కుల, మహిళ సంఘాలు, నూతన గ్రామ పంచాయతీ భవనాలతో పాటు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు కషితో మండలాన్ని అన్ని రంగాల్లో అభివద్ధి చేశానని..రానున్న ఎన్నికల్లో ప్రజలు మళ్లీ తనను ఆశీర్వదించాలని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం మండల పరిధిలోని కల్లెపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఆశీర్వాద సభలో ఎమ్మెల్యే రసమయి మాట్లాడారు. గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రపాలకుల చేతిలో తెలంగాణ రాష్ట్రంలోని బడుగుబలహీన వర్గాల ప్రజలెదుర్కొన్న కష్టాలను పాటల రూపంలో వెలుగులోకి తీసుకొచ్చి..తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించి మానకొండూర్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో రెండు దఫాలుగా ఎమ్మెల్యేగా ఎన్నికై.. రసమయి నువ్వు చేశావని ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలకు ఇదిగో ఇంత అభివద్ధి చేశానని సగర్వంగా చెబుతున్నానన్నారు. అభివద్ధి చేశాను కాబట్టే ప్రజలు మళ్లీ ఓట్లేసి అభివద్ధికి పట్టం కట్టి..మళ్లీ ఆశీర్వదించమని అభ్యర్థిస్తున్నానన్నారు. ప్రభుత్వం అమలు చేసిన పలు సంక్షేమ పథకాలను మండలంలోని అయా గ్రామాల్లో ఇంటింటా చేర్చానన్నారు. ఎంపీపీ నిర్మల, జెడ్పీటీసీ కవిత,ఏఎంసీ చైర్మన్ చంద్రకళ, సర్పంచ్ దారం లక్ష్మి,వైస్ ఎంపీపీ చెలుకల సభిత, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, మండల, గ్రామ బీఆర్‌ఎస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.