పది తక్కువ
కొడుకు : ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చారు నాన్నా…
తండ్రి : ఎన్ని మార్కులొచ్చాయి?
కొడుకు : రాము కంటే పది మార్కులు తక్కువ
తండ్రి : రాముకి ఎన్ని మార్కులు వచ్చాయి?
కొడుకు : పది మార్కులు.
వేడి చేసుకుని తింటా
అమ్మ : సూరీ, ఎండా కాలం సెలవల్లో ఎక్కువ ఐస్ క్రీంలు తినకు. అవి చల్లగా ఉంటాయి, గొంతు నొప్పి చేస్తుంది.
సూరి : ఏం పరవాలేదమ్మా.. నేను జాగ్రత్తగా ఉంటాలే. రోజూ నాలుగు ఐస్ క్రీంలు వేడి చేసుకొని తింటా.
రోగి – చికిత్స
సుబ్బారావు : అయ్యా డాక్టరుగారూ, నిన్నటినుండి ఆగకుండా ఎక్కిళ్లు వస్తున్నాయి, ఏం చెయ్యాలండీ?
డాక్టరు ఏం మాట్లాడకుండా వచ్చి సుబ్బారావుకు చాచి చెంపమీద ఒకటిచ్చాడు. సుబ్బారావుకు కళ్లు తిరిగాయి, కొద్ది సేపు ఏమీ మాట్లాడలేకపోయాడు.
డాక్టరు : చూశారా, ఎక్కిళ్ళు ఆగిపోయాయి? ఏదైనా షాక్ ఇస్తే ఎక్కిళ్లు ఆగిపోతాయని శాస్త్రం చెబుతుంది.
సుబ్బారావు : సార్! ఎక్కిళ్ళు నాకు కాదండీ, మా ఆవిడకు.
పరీక్ష
అప్పారావు : ఒరేరు! నువ్వు ఒకసారి మా యింటికి రారాదూ?
సుబ్బారావు : ఎందుకురా?
అప్పారావు : నేను ఓ కుక్కను కొన్నాను ఈ మధ్యే. అది దొంగలను పసిగడుతుందో లేదో చూద్దామని!
ఎవరిమీద అలక
రాజేష్ : రాజూ… పొద్దున్న నానమ్మ ఇంటికి, సాయంత్రం అమ్మమ్మ ఇంటికి భోజనానికి వెళుతున్నావు, మీ అమ్మానాన్నలు ఊర్లో లేరా?
రాజు : ఉన్నారు…
రాజేష్ : మరెందుకు అమ్మమ్మా, నానమ్మ వాళ్ళింటికి రోజూ వెళ్తున్నావు? మీ అమ్మా నాన్నల మీద అలిగావా?
రాజు : మా అమ్మేమో నాన్న మీద అలిగి వాళ్ళ పుట్టింటికి వెళ్లింది. నాన్నేమో అమ్మ మీద అలిగి వాళ్ళ నాన్న ఇంటికి వెళ్ళాడు. అందుకే నేను ఆ రెండు ఇళ్లకీ వెళ్తున్నాను రోజూ!గటం తెగింది…
నవ్వుల్ పువ్వుల్
- Advertisement -
- Advertisement -



