
– కాంగ్రెస్ తోనే ప్రజా సంక్షేమమని స్పష్టం
నవతెలంగాణ- బెజ్జంకి
కరీంనగర్ మాజీ ఎంపీ బోయినిపల్లి వినోద్ కుమార్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని విస్మరించి దోరల కుటుంబాల అభివృద్ధికే ప్రణాళికలు రుపోదించాడని యువజన కాంగ్రెస్ మండలాధ్యక్షుడు మంకాల ప్రవీన్ గురువారం ఆరోపించారు.కుల,మత,వర్గ విబేధాలకు తావులేకుండా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తూ సమన్యాయంతో పరిపాలన సాగించే ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమేనని ప్రవీన్ స్పష్టం చేశారు.ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును గెలిపించి ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ప్రజలను అయన విజ్ఞప్తి చేశారు.