నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లుఫ్తాన్సాకు చెందిన ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి శంషాబాద్‌కు వస్తున్న విమానంలో బాంబు ఉన్నట్లు దుండగులు ఈ-మెయిల్ ద్వారా హెచ్చరించారు. శంషాబాద్ చేరుకునేలోగా విమానాన్ని పేల్చేస్తామని బెదిరింపు మెసేజ్ పంపారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే ఎయిర్‌పోర్ట్ సిబ్బంది, భద్రతా విభాగాలు అత్యవసర చర్యలు చేపట్టాయి. విమానం ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ అయిన వెంటనే దానిని ఐసోలేషన్ బేకు తరలించారు. ప్రస్తుతం భద్రతా సిబ్బంది, బాంబ్ స్క్వాడ్ అధికారులు విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ప్రయాణికుల భద్రత కోసం అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ బెదిరింపు మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేపట్టారు. మెయిల్ సోర్స్, ఐపీ అడ్రస్ తదితర వివరాలను ట్రాక్ చేసే పనిలో ఉన్నారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


