- Advertisement -
నవతెలంగాణ – మోర్తాడ్: మండల కేంద్రంలోని చతురస్ర పాఠశాల ఆధ్వర్యంలో విద్యార్థులు బోనాల పండుగ సంబరాలను ఘనంగా నిర్వహించుకున్నారు. మంగళవారం పాఠశాల విద్యార్థులు గ్రామ దేవతల రూపధారణలతో మొదటి బోనాన్ని రేణుక ఎల్లమ్మ దేవాలయానికి సమర్పిస్తూ పండుగ నిర్వహించుకున్నారు. మహిళా విద్యార్థినులు దేవతల వేషధారణలో, బాలురు పోతురాజు వేషధారణలో పలువురిని ఆకర్షించారు. గ్రామంలోని పలు వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. విద్యార్థినుల వేషధారణలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ గిరి, ప్రధానోపాధ్యాయురాలు శ్రీదేవి, గంగ జమున, భవిత, నీలిమ, లాస్య, ఉపాధ్యాయుల బృందం పాల్గొన్నారు.
- Advertisement -



