15న బ్రిస్‌బేన్‌లో బోనాలు

ఎమ్మెల్సీ కవిత పోస్టర్‌ ఆవిష్కరణ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆస్ట్రేలియాలోని బ్రిస్‌బేన్‌లో జులై 15న భారత జాగతి ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు ఎమ్మెల్సీ కే కవిత తెలిపారు. శనివారం నాడామె దీనికి సంబంధించిన వాల్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సంద ర్భంగా అక్కడి తెలంగాణ వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమా నికి బ్రిస్‌ బేన్‌ తెలంగాణ అసోసియే షన్‌, క్వీన్స్‌ ల్యాండ్‌ తెలుగు , తెలుగు అసోసియేషన్‌ అఫ్‌ గోల్డ్‌ కోస్ట్‌, ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఆస్ట్రేలియా మద్దతు తెలిపాయి.

Spread the love