శ్రీ మైసమ్మ, ఫ్యామిలీ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ

నవతెలంగాణ – సిద్దిపేట
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిరూపం ఆషాడంలో అంగరంగా వైభవంగా జరుపుకునే  బోనాల పండుగ పురస్కరించుకొని
స్థానిక సిద్దిపేట పట్టణంలోని సుడా ఆఫీస్ ఎదురుగా ఉన్న శ్రీ మైసమ్మ, దుర్గమ్మ ఆలయంలో ఆదివారం శ్రీ మైసమ్మ ఫ్యామిలీ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు తీయడం జరిగింది.  ముఖ్య అతిథిగా 4వార్డ్ కౌన్సిలర్  కొండo కవిత సంపత్ రెడ్డి, పాల్గొన్నారు. శ్రీ మైసమ్మ ఫ్యామిలీ అసోసియేషన్స్ సభ్యులు చింతాకుల సత్యం, యాదగిరి, హరి, రమాకాంత్, వెంకటయ్య, నర్సింలు, రాజు, రవి, మోహన్, నారాయణ, మల్లేశం, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love