రవీంద్రభారతిలో పుస్తకావిష్కరణల సభ

నవతెలంగాణ – చండూరు  
చండూరు సాహితీ మేఖల సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 29 సోమవారం సాయంత్రం 5 గంటలకు రవీంద్ర భారతి హైదరాబాదులో సాహితీ మేఖల పలు పుస్తకాల ఆవిష్కరణ సభ ఏర్పాటు చేసిందని సంస్థ ప్రధాన కార్యదర్శి పున్న అంజయ్య తెలిపారు. సంస్థ సభ్యులైన సుందర దేశికులు రచించిన సుందరారామం అనే పద్యగేయకావ్యం, వరదదేశికులు రచించిన శ్రీకృష్ణ మృతం, వరదానందలహరి పుస్తకాల ఆవిష్కరణ మహోత్సవం జరుగుతుందని తెలిపారు. ఈ సంస్థకు   సంబంధించిన ఆహ్వాన పత్రికలను శనివారం సాహితీ మేఖల ప్రధాన కార్యదర్శి పున్న అంజయ్య,ప్రధాన వ్యవహర్త మంచుకొండ చిన్న బిక్షమయ్య, సభ్యులు సుధీర్ బాబులు చండూరులో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాహితీ మేఖల సంస్థ చండూరులో ఏర్పడి నేటికీ 90 సంవత్సరాలు అయ్యిందని, తెలంగాణలోని మొట్టమొదటి సంస్థగా చరిత్ర సృష్టించిందన్నారు. సోమవారం రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమంలో తెలుగు భాష తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డాక్టర్ మామిడి హరికృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొంటారని, ప్రముఖ సాహితీవేత్తలు డాక్టర్ మసన చెన్నప్ప, డాక్టర్ శ్రీ రంగాచార్యులు, సాహితీ మేఖల సంస్థ అధ్యక్షులు అంబటిపూడి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి, పుస్తక సమీక్షకులు డాక్టర్ ఇడుకుడ సచ్చిదానంద తదితరులు పాల్గొంటారని, సభను విజయవంతం చేయాలని వారు కోరారు.
Spread the love