Thursday, May 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మల్లాపూర్‌లో బాలుడు అదృశ్యం

మల్లాపూర్‌లో బాలుడు అదృశ్యం

- Advertisement -

నవతెలంగాణ – నాచారం : నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లాపూర్ బ్రహ్మపురి కాలనీలో 11 ఏళ్ల బాలుడు కనిపించకుండా పోవడం స్థానికంగా కలకలం రేపింది. జలబోయిన ప్రణీత్ యాదవ్ అనే బాలుడు గురువారం ఉదయం సుమారు 7 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. బాలుడు ఆటిజంతో బాధపడుతున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. తప్పిపోయే సమయంలో పసుపు రంగు టీ-షర్టు, నలుపు రంగు షార్ట్స్ ధరించి ఉన్నట్లు వెల్లడించారు.

బాలుడి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.బాలుడి గురించి ఎవరికిైనా సమాచారం తెలిసిన వెంటనే నాచారం పోలీస్ స్టేషన్‌కు 8712662149, 8712662694 నంబర్లకు సమాచారం అందించాలని పోలీసులు కోరారు. బాలుడి ని సురక్షితంగా గుర్తించేందుకు ప్రజలు ఈ సమాచారాన్ని సోషల్ మీడియా గ్రూపులు, పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -