Sunday, May 3, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నాచారం సర్కిల్‌లో ఎంటమాలజీ సిబ్బంది బదిలీలకు బ్రేక్

నాచారం సర్కిల్‌లో ఎంటమాలజీ సిబ్బంది బదిలీలకు బ్రేక్

- Advertisement -

ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి జోక్యంతో సిబ్బందికి ఊరట
నవతెలంగాణ-నాచారం

నాచారం సర్కిల్ డివిజన్‌లో పనిచేస్తున్న ఎంటమాలజీ సిబ్బందిని కాప్రా సర్కిల్‌కు బదిలీ చేయడంపై తలెత్తిన సమస్యకు పరిష్కారం లభించింది. ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు ఈ బదిలీల కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులను సిబ్బంది విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు. ఉప్పల్ జోనల్ కమిషనర్ రాధిక గుప్తా, మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనర్ టి. వినయ్ కృష్ణారెడ్డి, ఐఏఎస్‌లతో చర్చించి బదిలీలను తాత్కాలికంగా నిలిపివేయించారు.దీంతో సిబ్బందికి ఉపశమనం లభించగా, ఎమ్మెల్యేకు వారు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -