Thursday, July 2, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంతమ్మినేనిని పరామర్శించిన బృందా కరత్

తమ్మినేనిని పరామర్శించిన బృందా కరత్

- Advertisement -

నవతెలంగాణ – ఖమ్మంరూరల్
సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రంను ఆ పార్టీ జాతీయ నాయకురాలు బృందా కరత్ బుధవారం పరామర్శించారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని తెల్దారుపల్లి గ్రామంలో విశ్రాంతి తీసుకుంటున్న తమ్మినేని వీరభద్రంను కలిసిన బృందా కరత్ ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తమ్మినేని ప్రజా ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన పోరాట యోధుడని కొనియాడారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని తిరిగి ప్రజా జీవితంలోకి వచ్చి ఉద్యమాలు, పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆమె వెంట సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు ఆశాలత, పాలేరు డివిజన్ కార్యదర్శి బండి రమేష్, ఐద్వా జిల్లా కార్యదర్శి బండి పద్మ, ఐద్వా నాయకులు మాచర్ల భారతి, మెరుగు రమణ తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -