నవతెలంగాణ-నంగునూరు
కాంగ్రెస్ ఆరు గ్యారంటీ పథకాలతో బీఆర్‌ఎస్ అడ్రస్ గల్లంతుందనే భయంతో భయంతో కేటీఆర్, హరీష్ రావులు పిచ్చి కూతలు కూస్తున్నారని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి దేవులపల్లి యాదగిరి పేర్కొన్నారు. నంగునూరులో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారం ముసుగులో అవినీతి సొమ్ము తినుడు అలవాటు పడ్డ కేటీఆర్, హరీష్ రావులు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన పథకాలకు ప్రజలలో మంచి స్పందన రావడం శుభపరిణామం అన్నారు. ఓటమి తప్పదన్న చేదు నిజాన్ని జీర్ణించుకోలేని కేసీఆర్ కుటుంబం వ్యక్తిగత దూషణలు చేయడం తగదన్నారు. రెండు సార్లు అధికారంలోకి వచ్చి ప్రజల సంక్షేమాన్ని మర్చిపోయిన కేసీఆర్, మరోసారి దొంగ హామీలతో అధికారంలోకి వస్తామని పగటి కళలు కంటున్నాడని దుయ్యబట్టారు. తెలంగాణా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీతోనే అభివద్ధి సాధ్యమవుతుందని ప్రజలు నమ్ముతారని వారి నమ్మకాన్ని రాహుల్ గాంధీ నిజం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు కోరుకుంటున్న కాంగ్రెస్ పార్టిని నాయకులను విమర్శిస్తే బీఆర్‌ఎస్ పార్టీకి, కేటీఆర్‌కు హరీష్ రావు లకు పుట్టగతులు ఉండవని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చెలికా యాదగిరి, రాగుల కష్ణ, జంగిటి శ్రీనివాస్, దేవులపల్లి చింటూ, దేవులపల్లి శ్రీకాంత్, తిరుపతి, లక్ష్మన్, జంగిటి సంపత్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.