నవతెలంగాణ- మిరు దొడ్డి : మిరుదొడ్డి మండల కేంద్రము లో నాయీ బ్రాహ్మణ సేవా సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో మిరుదొడ్డి మండల అధ్యక్షులు పయ్యావుల యాదగిరి మిరుదొడ్డి మండల కేంద్రంలో ఇంటిట ప్రచారాన్ని నిర్వహించారు. దుబ్బాక బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు అందాలంటే తెలంగాణ ప్రభుత్వం అధికారంలో ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నరసింహులు నాయి నరేందర్ నాయి తిరుపతి నాయి రితిక్ నాయి నరసింహులు , కాజ కిష్టయ్య బైరయ్య తదితరులు పాల్గొన్నారు.