ప్రజలకు ఇచ్చిన హామీలను మరచిన బిఆర్ఎస్

– గణపాక సుధాకర్  కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి
నవతెలంగాణ-గోవిందరావుపేట
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చని బిఆర్ఎస్ పార్టీని ప్రజలు క్షమించరని కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా కార్యదర్శి గనపాక సుధాకర్ అన్నారు.  ఆదివారం  చల్వాయి గ్రామంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సుధాకర్ మాట్లాడుతూ బి ఆర్ ఎస్ పార్టీ కెసిఆర్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను మరచి తుంగలో తొక్కిందన్నారు.దళిత ముఖ్య మంత్రిని చేస్తా అని చెయ్యలేదనీ, 3ఎకరాలు భూమి ఇస్తా అని ఇయ్యలేదు.డబల్ బెడ్ రూములు ఇస్తా అని ఇయ్యలేదు. తెలంగాణ రాష్ట్రము వచ్చిన వెంటనే ఇంటికొక ఉద్యోగం ఇస్తా అని ఇవ్వలేదు.ఇంటికి కుక్కల కాపలా ఉంటా అన్నాడు ఉండలేదు.ఉచిత ఎరువులు ఇస్తా అని ఇయ్యలేదు.నిరుద్యోగ భృతి 3016రూపాయలు ఇస్తా అని ఇయ్యలేదు. SC, ST వర్గాల వారికీ 44 సంవత్సరాల వయో పరిమితి పెంచి ఉత్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదు.కమిషన్ల మిషన్ కాకతీయ, మిషన్ భగిరద, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి లక్షల కోట్ల రూపాయలు అవినీతిగా సంపాదించలేదా అన్నారు. అందుకే ఇలాంటి అవినీతి పార్టీకి ఓటు వెయ్యకూడదన్నారు.అందుకే తెలంగాణ సకల జనుల ప్రజలు టిఆర్ఎస్ పార్టీని ఓడించాల ని ఒక నిర్ణయానికి వచ్చారు అందుకే ములుగు నియోజకవర్గం లో  సీతక్కను అధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను వేడుకుంటున్నాను “ఇలాంటి వాగ్దానాలు ఇచ్చి మోసం చేసే పార్టీ ని ఇంటికి పంపాలని కోరారు.ఈ కమిషన్ల ప్రభుత్వం వద్దు కాంగ్రెస్ పార్టీ ముద్దు” అంటు ప్రజలకు తెలియజేసారు.ప్రజలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు.రాజ్యాంగ పరంగా ఎ నుకాపాడినటువంటి  ఎస్సీ ఎస్టీ బీసీ, వర్గాల వారికీ అటువంటి అభివృద్ధి జరగలేదు.కాబట్టి ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తెలంగాణ రాష్ట్రములో కాంగ్రెస్ పార్టీని అధికారంలో కి తీసుకోని రావాలి, కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల వారికీ న్యాయం జరుగుతుంది. “కాబట్టి బి ఆర్ ఎస్ పాలన పోవాలి కాంగ్రెస్ పాలన రావాలి ” అని కోరారు. ఈకార్యక్రమంలో గోవిందరావుపేట మండల వర్కింగ్ ప్రసిడెంట్ రస పుత్ సీతారాం నాయక్, చల్వాయి MPTC-1నాగలక్ష్మి, అనిల్ యాదవ్, చల్వాయి మాజీ సర్పంచ్ మేకల సుదర్శన్, జిల్లా BC సెల్ ప్రధాన కార్యదర్శి కాసార్ల రాంబాబు, పోశాల రాజకుమార్, మండల బూత్ ఇంచార్జ్ దేవరపల్లి మల్లారెడ్డి,గొల్లపూడి సాంబశివరావు జక్కీ వికాస్ రాజ్, ముద్దసాని సాయి,తదితరులు పాల్గొన్నారు.
Spread the love