కొత్త ఓటర్లను నమోదు చేయించిన బిఆర్ఎస్ నాయకులు 

నవ తెలంగాణ -కమ్మర్ పల్లి: 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటర్లుగా నమోదు చేయించాలన్న రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు బిఆర్ఎస్ నాయకులు కొత్త ఓటర్లను నమోదు చేయించారు. మంగళవారం గ్రామంలో మంత్రి ప్రశాంతి రెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఇంటింటికి బిఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించారు.అందులో భాగంగా 18 సంవత్సరాలు నిండి ఓటర్ గా నమోదు చేయించుకొని యువతి యువకులను గుర్తించి, వారిని కొత్త ఓటర్లుగా  నమోదు చేయించారు. గ్రామంలో 18సంవత్సరాలు నిండిన పలువురు యువతి  యువకుల దరఖాస్తులను తహశీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్  శరత్ అప్పగించి, కొత్త ఓటర్లుగా నమోదు చేయించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గడ్డం స్వామి మాట్లాడుతూ గ్రామంలో 18 సంవత్సరాలు నిండిన యువతి, యువకులు కొత్త ఓటర్లుగా నమోదు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్ బద్దం రాజేశ్వర్, ఉప సర్పంచ్ చిన్న గంగారం, టిఆర్ఎస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు హైమద్ హుస్సేన్, బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు చింత గణేష్, యూత్ మండల అధ్యక్షులు కొత్తపల్లి రఘు, నాయకులు లోలపు సుమన్, రేంజర్ల మహేందర్, తీగల హరీష్, సుంకరి మురళి, పన్నాల గంగారెడ్డి, మల్కాయి రాజన్న, తదితరులు పాల్గొన్నారు.
Spread the love