బీజేపీతో బిఅర్ఎస్ లోపాయికారి ఒప్పందం..

– జీవన్ రెడ్డి గెలుపు కోసం కృషి చేసిన వారందరికీ ధన్యవాదాలు..
– రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి..
నవతెలంగాణ-డిచ్ పల్లి
పార్లమెంట్ (లోక్ సభ) సాధారణ ఎన్నికలు 2024, ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి (18 ఎప్రిల్ నుండి ఎన్నికల ప్రచారం ముగిసే వరకు తీవ్రమైన ఎండలను కూడా లెక్కచేయకుండా, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి టి జీవన్ రెడ్డి  గెలుపు కోసం అహర్నిశలు కృషి చేశారు.  కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ధన్యవాదాలు తెలుపుతున్నానని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం ఎన్నికల కౌంటింగ్ ముగిసిన తర్వాత ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి ఓటమికి రెండు కారణాలు ఉన్నాయని బిఅర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో నామమాత్రంగా పాల్గొని, కేసీఆర్ తన కుటుంబాన్ని, కవితను అవినీతి  నుండి కాపాడు కొనడానికి, తన పార్టీని బీజేపీ పార్టీ అభ్యర్థుల గెలుపునకు లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనివల్ల కాంగ్రెస్ పార్టీ కొన్ని స్థానాలో ఓటమి చెందిందని వివరించారు. బీజేపి మత ప్రదికగా ప్రజలను రెచ్చగొట్టి, ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి విరుద్దంగా వ్యహరించిందని పేర్కొన్నారు. ఏదేమైనా ప్రజా తీర్పును తమందరం గౌరవిస్తున్నామని ‌వివరించారు.
Spread the love