
నాగిరెడ్డిపేట మండలంలోని వదలపర్తి పోచారం గ్రామాలలో శుక్రవారం రోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు జోరుగా ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ ను ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని వారు ఓటర్లను కోరారు. కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గుర్రాల సిద్దయ్య జెడ్పిటిసి సభ్యుడు మనోహర్ రెడ్డి తో పాటు బీఆర్ఎస్ నాయకులు కృష్ణ, శ్రీనివాస్, రాజిరెడ్డి ,మంగలి యాదగిరి ,బాబురావు ,వంశీ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.