కేసిఆర్ రోడ్ షోకు భారీ ఎత్తున తరలి వెళ్లిన బీఆర్ఎస్ శ్రేణులు 

నవతెలంగాణ – కమ్మర్ పల్లి 

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం సాయంత్రం జరగనున్న బిఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్డు షోకు మండలంలోని ఆయా గ్రామాల నుండి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు.ఆయా గ్రామాల నుండి ప్రైవేటు, స్కూలు బస్సుల్లో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి వెళ్లారు. జిల్లా కేంద్రంలో నిజామాబాద్ లోక్ సభ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కు మద్దతుగా కేసిఆర్ రోడ్ షో నిర్వహించనున్నారు.ఈ రోడ్ షో లో పాల్గొన్నందుకు మండలంలోని ఆయా గ్రామాల నుండి పదుల సంఖ్యలో వాహనాల్లో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిజామాబాద్ తరలి వెళ్లారు.
Spread the love