పోలీసుల అదుపులో బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా కన్వీనర్‌ క్రిశాంక్‌

నవతెలంగాణ-ఓయూ
హైదరాబాద ఉస్మానియా యూనివర్సిటీ మెస్‌ల మూసివేతపై దుష్ప్రచారం చేసిన కేసులో బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా కన్వీనర్‌ మన్నె క్రిశాంక్‌, ఓయూ విద్యార్థి నాగేందర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం వారు కొత్తగూడెం నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా పంతంగి టోల్‌ గేట్‌ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని ఓయూ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

Spread the love