ఘనంగా కార్మిక దినోత్సవ వేడుకలు

నవతెలంగాణ-కంటోన్మెంట్‌
కార్మిక హక్కుల పరిరక్షణకు ఉద్యమిద్దామని ఏఐటీ యూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం నరసింహ పిలుపునిచ్చారు. బుధవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో తిరుమలగిరి కమ్యూనిటీ హాల్‌, బోయిన్పల్లి సర్కిల్‌ కార్యాల యం, జూబ్లీ జూబ్లీ బస్‌ స్టేషన్‌ వద్ద, బోయిన్‌పల్లి మార్కెట్‌ హమాలి యూనియన్‌ ఆధ్వర్యంలో మార్కెట్‌ ఆవరణలో, జేబీఎస్‌ టాక్సీ డ్రైవర్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో జరిగిన మేడే వేడుకల్లో ఏఐటీయూసీ జెండాను వారు ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంటోన్మెంట్‌ పరిధిలో ఉన్న కార్మికులకు యూనియన్‌ ఏర్పాటు చేసి గత 20 సంవత్సరాలుగా అనేక హక్కుల్ని సాధించటం జరిగిందని తెలిపారు. భవిష్యత్తులో ఉద్యోగాల క్రమబద్ధీకరణకు పోరాటం నిర్వహించనున్నట్టు తెలియజేశారు.ఈ కార్యక్రమాల్లో బోయిన్‌పల్లి మార్కెట్‌ హమాలి యూనియన్‌ నాయకులు ఎన్‌.ఎల్లయ్య, కే. కొమురయ్య, రాజు, లింగం, మహేందర్‌, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డ్‌ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయ కులు బాలకష్ణ, శేఖర్‌, నాగరాజు, ప్రసాద్‌, నాగమణి గీత, జేబీఎస్‌ టాక్సీ డ్రైవర్‌ యూనియన్‌ నాయకులు శ్రీకాంత్‌, కంటోన్మెంట్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు డిబి దేవేందర్‌, మధుకర్‌, వందలాదిమంది కార్మికులు పాల్గొన్నారు.
మేడే వేడుకల్లో శ్రీ గణేష్‌
కంటోన్మెంట్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్‌ మేడే వేడుకల్లో పాల్గొని కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం జేబీఎస్‌ వద్ద ఏఐటీయూసీ కార్మిక నాయకుడు నరసింహ ఆధ్వర్యంలో నిర్వహించిన మేడే వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేసి తనను గెలిపిస్తే కార్మికుల హక్కుల కోసం, వారి సమస్యల పరిష్కారానికి కషి చేస్తానని హామీ ఇచ్చారు. కంటోన్మెంట్‌ బోర్డును జీహెచ్‌ఎంసీలో విలీనం చేసేందుకు, అదేవిధంగా కాంట్రాక్టు కార్మికులకు సొంత ఇంటిని ఏర్పాటు చేసేందుకు, ఉద్యోగాల క్రమబద్ధీకరణకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. బోయిన్‌పల్లి మార్కెట్‌ హమాలి యూనియన్‌ నాయకులు ఎన్‌ ఎల్లయ్య, కే కొమురయ్య, రాజు, లింగం, మహేందర్‌, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డ్‌ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూని యన్‌ నాయకులు బాలకృష్ణ, శేఖర్‌, నాగరాజు, ప్రసాద్‌, నాగమణి గీత, జేబీఎస్‌ టాక్సీ డ్రైవర్‌ యూనియన్‌ నాయకులు శ్రీకాంత్‌, కంటోన్మెంట్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు డిబి దేవేందర్‌, జంపన ప్రతాప్‌ వందలాదిమంది కార్మికులు పాల్గొన్నారు
మెంటల్‌ హాస్పిటల్‌లో మేడే వేడుకలు
జూబ్లీహిల్స్‌: ఎర్రగడ్డ లోని గవర్నమెంట్‌ మెంటల్‌ హాస్పిటల్‌లో సీఐటీయూ ఆధ్వర్యంలో మేడే జెండా ఆవిష్కరించి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ జూబ్లీహిల్స్‌ జోన్‌ కార్యదర్శి, మెంటల్‌ హాస్పిటల్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రాపర్తి అశోక్‌, జోన్‌ నాయకులు గడసందు బిక్షపతి, మెంటల్‌ హాస్పిటల్‌ యూనియన్‌ ఉపాధ్యక్షులు ఓం ప్రకాష్‌, శ్రీధర్‌, తిరుపతి రెడ్డి, కమిటీ సభ్యులు బి భాగ్య, పి లక్ష్మి ,ఎస్‌ లింగయ్య, ఏ మంజుల తదితరులు పాల్గొన్నారు.
ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో
ఓయూ: ఐఎఫ్‌టీయూ అనుబంధ ప్రోగ్రెసివ్‌ కాంట్రాక్ట్‌ అండ్‌ క్యాజువల్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వ ర్యంలో మేడే జెండాను ఓయూ యూనియన్‌ నాయకులు బుధవారం లక్ష్మి ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి ఆర్‌ శంకర్‌ అధ్యక్షత వహించగా ఇఎఫ్‌టీయూ జిల్లా అధ్యక్షులు ఎస్‌.ఎల్‌ .పద్మ, కాంట్రాక్ట్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి ఎస్‌ శ్రీనివాస్‌, పీడీఎస్‌యూరాష్ట్ర నాయకులు ఎస్‌ నాగేశ్వరరావు ,ఓయూ నాయకులు సుమంత్‌ లు పాల్గొని ప్రసంగించారు. ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్స్‌ ఉద్యోగులు సంఘటిత చైతన్యంతో తమ డిమాండ్ల సాధన కోసం నిరంతరాయంగా పోరాడుతున్నారని అన్నారు. ఓయూ నాయకులు సావిత్రి, జయ శివ కుమార్‌ ,సుల్తాన్‌, ఈశ్వరయ్య, కష్ణ విజయ ,భారతి ,పద్మ, అనిత, సారయ్య, జంపయ్య, భూమయ్య, యాస్మిన్‌, విజయ ,శ్రీనివాస్‌, ఉజ్వల, పాల్గొన్నారు.
ఆర్ట్స్‌ కాలేజ్‌ వేదికగా ఏఐటీయూసీ ఓయూ ఆధ్వర్యంలో మే డే ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రేమ్‌ పావని మాట్లాడుతూ. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న మోడీ ప్రభుత్వాన్ని పార్లమెంటు ఎన్నికలలో ఓడించాలని కోరారు.ఈ కార్యక్రమంలో కామ్రేడ్‌ శ్రీనివాస్‌ కార్మిక నేతల పాల్గొన్నారు.
ఓయూ ఆర్ట్స్‌ కాలేజ్‌ వద్ద ఉస్మానియా యూనివర్శిటీ కాంట్రాక్టు ఔట్‌ సోర్సింగ్‌ యూనియన్‌(సీఐటీయూ) ఆధ్వర్యంలో సీఐటీయూ జెండాను యూనియన్‌ ఉపాధ్యక్షురాలు అనసూయ జెండా ఆవిష్కరించారు. తెలంగాణ యూనివర్సిటీస్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, ఓయూ యూనియన్‌ అధ్యక్షులు టీ.మహేందర్‌ మాట్లాడుతూ . రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినా కార్మికుల బతుకులు మారటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఓయూలో పని చేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ,టైమ్‌ స్కేల్‌ ఉద్యోగులను పర్మినెంట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.లేని పక్షంలో రాబోయే కాలంలో కార్మికులందరికీ సమీకరించి పెద్ద ఎత్తున ఆందో ళన చేస్తామని హెచ్చరించారు. ఓయూ యూనియన్‌ నాయకులు కరీం,దేవేందర్‌,శ్రీను, సీతయ్య,ఔట్స్‌ సోర్సింగ్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి సీతారాం,వర్కింగ్‌ ప్రెస ిడెంట్‌ శ్రీధర్‌ రావు,ఉపాధ్యక్షులు శ్రీను,నాగరాజు,మోహన్‌ నాయ కులు యాదమ్మ, మాక్సూద్‌,శ్రీకాంత్‌, వేంకటేశ, పద్మ,లక్ష్మి, రాజు,రమేష్‌, నేహురు పాల్గొన్నారు.

Spread the love