జలమండలిని సందర్శించిన ట్రైనీ ఐఏఎస్‌ బృందం

నవతెలంగాణ-సిటీబ్యూరో
తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన 2022 బ్యాచ్‌కి చెందిన ఆరుగురితో కూడిన ట్రైనీ ఐఏఎస్‌ బందం జలమం డలిని సందర్శించింది. ఒకరోజు ఒరియెంటేషన్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా బుధవారం ఖైరతాబాద్‌లోని ప్రధాన కార్యాలయానికి విచ్చేసి జలమండలి కార్యకలాపాల గురించి వారు తెలుసుకున్నారు. ఎండీ సుదర్శన్‌ రెడ్డి బోర్డు పనితీరు, నగరానికి నీటి సరఫరా, ఎస్టీపీలు, మురుగు శుద్ధి నిర్వహ‌ణతో పాటు భవిష్యత్తు ప్రణాళికలు, ప్రాజెక్టుల గురించి వారికి వివరించారు. కోటి 30 లక్షలకు పైగా జనాభా ఉన్న హైదరాబాద్‌ మహా నగరానికి భారీ పైపు లైన్ల ద్వారా మంచి నీరు సరఫరా చేస్తున్న పద్ధతిని తెలిపారు. దీంతో పాటు నీటి శుద్ధి, వివిధ దశలలో నీటి శుద్ధీకరణ జరిగే ప్రక్రియ, క్లోరి నేషన్‌, తుది దశగా హైదరాబాద్‌కు భారీ మోటర్లతో పంపిం గ్‌ వంటి అంశాల గురించి వివరించారు. రెవెన్యూ డైరెక్టర్‌ వీఎల్‌ ప్రవీణ్‌ కుమార్‌ జలమండలిలో చేపట్టిన వివిధ సంస్కరణలు, కార్మికుల కోసం జలమండలి చేపట్టే రక్షణ చర్యలతో పాటు ఇప్పటి దాకా చేపట్టిన ప్రాజెక్టులు కష్ణా, గోదావరి, హడ్కో రిజర్వాయర్లు, ఓఆర్‌ఆర్‌ ఫేజ్‌- 1, 2 ప్రాజెక్టులు, వంద శాతం ముగురు శుద్ధి కోసం చేసే ఎస్టీపీల ప్రాజెక్టుల గురించి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. రాబోయే 50 ఏండ్లలో చేపట్టే భవిష్యత్తు కార్యాచరణ గురిం చి తెలిపారు. అనంతరం వారు మినీ జెట్టింగ్‌, సిల్ట్‌ కార్టింగ్‌, ఎస్పీటీ వాహనాలతో పాటు రోబోటిక్‌ సీవర్‌ క్రాక్‌ తదితర యంత్రాల పని తీరును డైరెక్టర్‌ ఆపరేషన్స్‌ – 1 అజ్మీరా కృష్ణ వివరించారు.

Spread the love