కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం

– నిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బీరప్ప
– కార్మిక వ్యతిరేకి బీజేపీని ఓడించాలి : సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌
నవతెలంగాణ-బంజారాహిల్స్‌
కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని నిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బీరప్ప అన్నారు. నిమ్స్‌ కాంట్రాక్ట్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ (సీఐటీయూ) ఆధ్వర్యంలో నిమ్స్‌ హాస్పటల్‌ లో యూనియన్‌ బ్యాంకు వద్ద సభ నిర్వహించి, నిమ్స్‌ గేటు వద్దకు ప్రదర్శనగా వెళ్లి జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సభకు సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌,నిమ్స్‌ హాస్పిటల్‌ డైరెక్టర్‌ నగరి బీరప్పలు ముఖ్య అతిథులుగా హాజరై ప్రంగించారు. నిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బీరప్ప మాట్లా డుతూ… నిమ్స్‌ కార్మికులకు, సిబ్బందికి మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. నిమ్స్‌ హాస్పటల్లో పనిచేస్తున్న ప్రతీ ఒక్కరు ఒక కుటుంబం లాగా భావించి పనిచేయాలని కోరారు. ప్రభుత్వం వైపు నుంచి కార్మికులకు రావలసిన సదుపాj ూలు అన్ని ఇచ్చే విధంగా తన వంతు కషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం పాలాడుగు భాస్కర్‌ మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న 29 చట్టాలను బీజేపీ కేంద్ర ప్రభుత్వం రద్దుచేసి 4 లేబర్‌ కోడ్లుగా మార్చి 12 గంటల పని దినాన్ని తీసుకొచ్చి కార్మిక వర్గాన్ని నయా బాని స విధానంలోకి తీసుకెళ్తున్నదని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్‌ ఎన్నికలలో కార్మికులు రైతులు పేదలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చ జరపకుండా కులం, మతం, ప్రాంతం ఆధారంగా ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు వేయించుకొని మరోసారి అధికారంలోకి రావా లని బీజేపీపన్నాగం పన్నుతున్నదని అన్నారు. కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం వస్తే కార్మికుల బతుకులు పెనం మీద నుండి పొయ్యిలో పడతాయని హెచ్చరించారు. కావున రాబోయే ఎన్నికలలో కార్మిక వ్యతిరేక బీజేపీని ఓడించాలని పిలుపు ఇచ్చారు.
నర్సెస్‌ యూనియన్‌ అధ్యక్షురాలు ఆషా లత, ప్రధాన కార్యదర్శి విజయకుమారిలు మాట్లాడుతూ… కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. రాబోయే కాలంలో సమస్యల మీద కలిసి పని చేద్దామని అన్నారు. యూనియన్‌ అధ్యక్షులు ఎం.వెంకటేష్‌ మాట్లాడుతూ… ప్రస్తుతం దేశంలో పెరిగిన ఉత్పత్తి, ఆదాయం మొత్తం ఒక శాతంగా ఉన్న కార్పొరేట్‌ శక్తులు, భూస్వాముల అధీనంలో ఉన్న దని విమర్శించారు. నూటికి 99 శాతంగా ఉన్న కార్మికులు కష్ట జీవులు, పేదల బ్రతుకులు దీనాతి దీనంగా పూట గడవని పరిస్థితిలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేనా మోడీ చేసిన అభివద్ధి అని ప్రశ్నిం చారు.ప్రధానమంత్రి మోడీ చెప్తున్నట్టు భారతదేశం ప్రపంచంలోనే 5వ ఆర్థిక వ్యవస్థ, లేదా 3వ ఆర్థిక వ్యవస్థ అయినా కష్టజీవులకు ఒరిగేది ఏమీ లేదని అన్నారు. కనీస వేతనాన్ని రూ26,000/- వేలకు పెంచాలని డిమాండ్‌ చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసం మేడే స్ఫూర్తితో రాబోయే కాలంలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాటంలోకి రావాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఇ.నరసింహులు,వెంకటేష్‌ యూనియన్‌ నాయకత్వంతో పాటు, కార్మికులు పెద్ద సంఖ్యలో తదితరులు పాల్గొన్నారు.

Spread the love