ప్రతిభ కనబరిచిన ఎంబీఏ విద్యార్థులకు సత్కారం

నవతెలంగాణ-దుండిగల్‌
మల్లారెడ్డి విశ్వవిద్యాలయం( ఎంఆర్‌యు) కు చెందిన ఎంబీఏ 2024 బ్యాచుకు చెందిన ప్రతిష్ట కనబరిచి విజయాలను అందుకున్న విద్యార్థులను బుధవారం మేమెంటోలు అందజేసి సత్కరించారు. హైదరాబాదులోని దూలపల్లి మైసమ్మగూడలో గల మల్లారెడ్డి విశ్వవిద్యా లయం (ఎంఆర్‌యు) యూనివర్సిటీలో గల ఆడిటోరియం లో సన్‌స్టోన్‌ సహకారంతో ఎంబిఏ సూపర్‌ అచీవర్స్‌, క్లాస్‌ ఆఫ్‌ 2024 కి విద్యార్థులను ఘనంగా వేడుక నిర్వహించి సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్‌ సిహెచ్‌ మల్లా రెడ్డి, ప్రత్యేక అతిథిగా ఎంఆర్‌ యు వైస్‌-ఛాన్సలర్‌ విఎస్‌కె రెడ్డి, ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ బ్యాచ్‌లో 70 శాతం ఇప్పటికే ఉద్యోగాలను పొంది ఉండగా, జూలై నాటికి 100 శాతం ప్లేస్‌మెంట్‌ని సన్‌స్టోన్‌ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతిష్టాత్మక సంస్థలైన అమెజాన్‌, టిఎంఐ గ్రూప్‌, బజాజ్‌ అలియాంజ్‌, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌, ఐసీఐసీఐ అసెట్‌ మేనేజ్‌మెంట్‌, ఐడిఎఫ్‌ సి ఫస్ట్‌ బ్యాంక్‌, అంబుజా సిమెంట్‌ మొదలైన ప్రతిష్టాత్మక సంస్థల్లో విద్యార్థులు ఉద్యోగాలు పొందారు. సన్‌స్టోన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మోహిత్‌ వాటల్‌ మాట్లాడుతూ… మా లక్ష్యం అసాధారణమైన అభ్యాస అనుభవం అందించటం, అని అన్నారు. యజమాన్యం మల్లారెడ్డితోపాటు అతని మొత్తం విశ్వవిద్యాలయ బందం విద్యార్థులకు ఈ ఉన్నతమైన ఫలితాలను అందించడంలో మాకు సహాయపడింది తెలిపారు. పరిశ్రమ 4.0 నైపుణ్యాలు నగరంలో అత్యుత్తమ ప్లేస్‌మెంట్‌లతో విద్యార్థు లకు సాధికారత కల్పించడాన్ని మేము భవిష్యత్తులో సైతం కొనసాగించాలనుకుం టున్నాము అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్‌ సిహెచ్‌. మల్లా రెడ్డి మాట్లాడుతూ పరిశ్రమకు సిద్ధంగా ఉన్న శిక్షణా విధానంతో మా విశ్వ విద్యాలయంలో విద్యార్థులకు ప్లేస్‌మెంట్‌ అవకాశా లను అందించటం ద్వారా విద్యార్థుల జీవితానికి అపారమైన విలువను సన్‌స్టోన్‌ జోడించిందన్నారు. మా విద్యార్థులు సాధించిన విజయాన్ని వారితో జరుపుకోవడానికి ఇక్కడకు రావడం నిజంగా గౌరవంగా ఉందని అన్నారు. అలాగే, విసి విఎస్‌కె రెడ్డి ఈ కార్యక్రమం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, విజయవంతమైన కెరీర్‌ని ప్రారంభించిన విద్యార్థులలో ఆనందం చూసి తాను సంతోషిస్తున్నానని అని అన్నారు.

Spread the love