మతోన్మాద బీజేపీని ఓడించండి.. లౌకిక, ప్రజాస్వామిక శక్తులను గెలిపించండి

– సీఐటీయూ కుత్బుల్లాపూర్‌ మండల కార్యదర్శి కీలుకాని లక్ష్మణ్‌
నవతెలంగాణ-కుత్బుల్లాపూర్‌
ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా కుత్బుల్లాపూర్‌ మండల పరిధిలో సీఐటీయూ, సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో షాపూర్‌ నగర్‌ భగత్‌ సింగ్‌ నగర్‌ జగద్గిరిగుట్టలో మేడేను ఘనంగా నిర్వహించారు. అనంతరం షాపూర్‌ నగర్‌ సీఐటీయూ ఆఫీసులో జరిగిన సభలో ముఖ్యఅతిథిగా సీఐటీయూ మండల అధ్యక్షులు కీలుకాని లక్ష్మణ్‌ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 1886వ సంవత్సరం అమెరికాలోని చికాగో నగరంలో 18 గంటల పని విధానానికి వ్యతిరేకంగా 8 గంటల పని విధానం కావాలని కార్మికులు సమ్మె చేస్తే యాజమాన్యం, పోలీసులు జరిపినదాడిలో తమ రక్తాన్ని చిందించిపోరాడి కార్మికులు తమ హక్కులను సాధించుకున్నారు. అప్పటినుంచి నేటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కార్మికులు మే 1 తేదీన మేడే ఉత్సవాల ను జరుపుకుంటున్నారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి కార్మిక వర్గంపై అనేక భారాలు మోపుతూ కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చి కార్మికులకు పని గంటలు పెంచి సంఘం పెట్టుకునే హక్కును కాల రాసింది. ప్రభుత్వ రంగ సంస్థ లను కార్పొరేట్‌ సంస్థలకు అప్పజెప్పటం విపరీతంగా నిత్యవసర ధరలు పెంచి ప్రజలపై అనేక బారాలు మోపింది రైతు వ్యతిరేక మూడు నల్ల చట్టాలను తీసుకు వచ్చి రైతుల మనుగడకి నష్టం కలిగించే చర్యలకు బీజేపీ ప్రభుత్వం పాల్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కార్మిక, ప్రజా రైతు వ్యతిరేక విధా నాలను అనుసరిస్తున్న బీజేపీని ఓడించాలని పిలుపు నిచ్చారు. సీఐటీయూ మండల కమిటీ నాయకులు కే బీరప్ప, పి.అంజయ్య, ఈ దేవదానం, ఆర్‌.స్వాతి, సీపీఐ(ఎం) పార్టీ మండల కమిటీ సభ్యులు బి.సత్యం, ఆటో యూనియన్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love