బస్‌ పాసులను వికలాంగులు సద్వినియోగం చేసుకోవాలి

– పరిగి డిపో మేనేజర్‌ పవిత్ర
– సర్పంచ్‌ లక్ష్మీ ఆనంద్‌
నవతెలంగాణ-కుల్కచర్ల
ఉచిత బస్‌ పాస్‌లను వికలాంగులు సద్వినియోగం చేసుకోవాలని పరిగి డిపో మేనేజర్‌ పవిత్ర అన్నారు. బుధ వారం కుల్కచర్ల మండలం ముజాహిద్‌పూర్‌ గ్రామంలో వికలాంగుల పాసుల పై అవగాహనా కార్యక్రమం నిర్వ హించి సర్పంచ్‌ లక్ష్మి ఆనంద్‌ ఆధ్వర్యంలో వికలాంగులకు ఉచిత బస్‌పాస్‌లను అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ…సీతారాముల కళ్యాణం తలం బ్రాలలో పరిగి డిపోని రాష్ట్రంలో రెండోస్థానానికి చేర్చి డిపోని లాభాల్లోకి తీసుకొచ్చిన డీఎం పవిత్రకు ప్రతేకంగా అభివందనలు తెలిపి ఘనంగా సన్మానించారు. కార్యక్ర మంలో వికలాంగుల పాసుల దాత బోడికే అరవింద్‌, రాజేశ్వరి, మల్లేశం, సోమల నాయక్‌, బాల్‌ రాజు, ప్రసాద్‌, ఆంజనేయులు, జంగయ్య, గోపాల్‌, అనంతయ్య, చంద్ర భూపాల్‌ రావు, పులింగ, చిన్నవెంకటేష్‌ గ్రామస్తులు విక లాంగులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love