Thursday, July 23, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమహిళపై క్యాబ్‌ డ్రైవర్ 
లైంగిక దాడి యత్నం

మహిళపై క్యాబ్‌ డ్రైవర్ 
లైంగిక దాడి యత్నం

- Advertisement -

పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు
కేసు నమోదు, నిందితుడి అరెస్టు

నవతెలంగాణ-శంషాబాద్
క్యాబ్‌లో ఎక్కిన మహిళను సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చాల్సిన ఓ డ్రైవర్ ఆ మహిళపై లైంగిక దాడికి యత్నించిన ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్ పోర్టు పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం వెలుగులోకి వచ్చింది. ఎయిర్‌ ‌పోర్టు పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లాకు చెందిన ఎర్ర పోగు ప్రశాంత్ కుమార్ శంషాబాద్ సిద్ధాంతి గ్రామంలో నివాసం ఉంటూ క్యాబ్ డ్రైవర్‌‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతను ఈనెల 20వ తేదీన మధ్యాహ్న సమయంలో ఒక మహిళను కారులో ఎక్కించుకొని బయలుదేరాడు. క్యాబిన్ క్రూ మార్గమధ్యలో ఉండగా, కారును దారి మళ్లించాడు. నిర్మానూష ప్రాంతమైన ‌నిర్మాణంలో తన క్యాబ్‌‌ను ఆపి, టాయిలెట్‌‌కి వెళ్తానని చెప్పి బండి పక్కకు పెట్టాడు. బండిలో నుంచి దిగి, టాయిలెట్‌‌కి వెళ్లిన అనంతరం వెనక సీటు వైపు వచ్చి ఆ మహిళపై లైంగికదాడికి యత్నించాడు. వెంటనే బాధితురాలు ప్రతిఘటించడంతో డ్రైవర్‌ ‌పరారయ్యాడు. అనంతరం ఆమె స్థానిక పోలీసులకు సమాచారం అందించి, క్యాబ్‌ ‌డ్రైవర్‌‌పై కేసు పెట్టింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. అతను నేరం ఒప్పుకోవడంతో మెడికల్ ఎగ్జామినేషన్ చేపించి, అనంతరం నిందితుడిని రిమాండ్‌‌కు తరలించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -