తొలిసారిగా పేపర్‌లెస్ పద్ధతిలో నిర్వహణ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ర్ట మంత్రివర్గ సమావేశం ఈనెల 18న జరగనుంది. ఆరోజు మధ్యాహ్నం 3 గంటలకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ర్ట సచివాలయంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరుగుతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఎజెండాను ఖరారు చేసే పనిలో అధికారులు ఉన్నారు. అయితే తొలి సారిగా మంత్రివర్గ సమావేశాన్ని పేపర్లు లేకుండా నిర్వహించాలని సీఎం ఆదేశించినట్టు తెలిసింది. దీనితో ఇ-క్యాబినెట్ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అజెండాను కూడా మంత్రులకు మెయిల్స్ ద్వారానే పంపాలని నిర్ణయించినట్టు తెలిసింది. మంత్రివర్గ సమావేశంలో అధికారులు కూడా పవర్‌పాయింట్ ప్రజెంటేషన్లకు సంబంధించి ఎలాంటి పేపర్లు వాడకుండా, మంత్రులకు వాటిని ముందుగానే మెయిల్ ద్వారా పంపే ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. క్యాబినెట్‌లో చర్చించే మరికొన్ని అంశాలను సమావేశ సమయంలో మంత్రులకు పెన్‌డ్రైవ్ ద్వారా అందించాలని భావిస్తున్నారు. ఈ పద్ధతి ఇక్కడ సక్సెస్ అయితే, ఇక అన్ని ప్రభుత్వ సమావేశాలను ఇదే పద్ధతిలో నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి సీఎస్ రామకృష్ణారావుకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది.
18న మంత్రివర్గ సమావేశం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



