క్యాడర్స్ సిబ్బంది కి రెగ్యులర్ చేయాలి, జీతాలు పెంచాలి..

– ఎన్ హెచ్ ఎం స్కీం లో పనిచేయుచున్న ఎన్ హెచ్.ఎం.అల్ క్యాడర్స్ సిబ్బంది కి రెగ్యులర్ చేయాలనీ , జీతాలు పెంచాలి..
– ఎఐటియుసి రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం నర్సింహ, ఎన్ హెచ్ ఎం. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామా రాజేష్ ఖన్నా డిమాండ్ 
నవతెలంగాణ -సుల్తాన్ బజార్ 
నేషనల్ హెల్త్ మిషన్ స్కీం లో గత అనేక సంవత్సరాలుగా పనిచేయుచున్న అల్ క్యాడర్లు ఉద్యోగులుకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం నరసింహ , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామా రాజేష్ ఖన్నా విమర్శించారు. నేడు ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ ఆధ్వర్యంలో కోటీలోని  డీ.హెచ్. కార్యాలయం ముందు మహాధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2018లో జీవో నెంబర్ 510 విడుదలైన సందర్భంగా కొద్దిమంది పై స్థాయి కేటగిరీల వారికి మాత్రమే జీతాలు పెంచి కింది కీటగిరిల వాళ్లను విస్మరించడం జరిగిందని తద్వారా నాటి నుండి నేటి వరకు కూడా కిందిస్థాయి సిబ్బంది జీతాలు పెంచకుండా అధికారులు ,రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తున్నారని వారు విమర్శించారు. నేషనల్ హెల్త్ మిషన్ స్కీం ద్వారా సిబ్బందికి సరిపడా బడ్జెట్ ఉన్నప్పటికీ వీరి ద్వారా అన్ని రకాల పనులను చేయించుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం జీవో 510 ప్రకారం జీతాలు మాత్రం పెంచడం లేదని వారు విమర్శించారు. ఎన్. హెచ్. ఎం. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా మాట్లాడుతూ జీతాల పెంపుదల కోసం గతంలో అనేక పర్యాయాలు కమిషనర్ ,డీ.హెచ్. విజ్ఞవించిన సమస్య పరిష్కరించకపోవడం అన్యాయమని వెంటనే వీరి జీతాలు పెంచాలని వారు వివరించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఆఫీస్ లో అందజేయడం జరిగింది. మద్దతును పలికిన టీ అసోసియేషన్ చైర్మన్ భారతసత్యనారాయణ , ఈ కార్యక్రమము లో ఎన్.హెచ్.ఎం.డిప్యూటీ సెక్రటరీ బాపు యాదవ్ , ఎన్.హెచ్.ఎం.హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ బద్రి వేణు , బీ.మధుకర్ , నాయకులూ నురా సంపత్ కుమార్ , పీ.దిలీప్ కుమార్ , జోగలక్ష్మి , కుమార్ , ముస్తాక్ , రమేష్ , హనుమంతు సుజాత , నర్సింహ , నవీన్ , అజమాత్ , రామకృష్ణ బాలు , రఘ్వవేంద్ర , రాముల్లమ్మ , మరియు తదితరాలు పాల్గోన్నారు.
Spread the love