నవతెలంగాణ-సంగారెడ్డి
సంగారెడ్డి జిల్లా పరిధిలోని 6 నుండి 9వ తరగతి విద్యార్థుల కోసం 2026-27 సంవత్సరానికి గానూ దీన్ దయాల్ స్పర్శ్ పథకానికి స్కాలర్ షిప్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని సంగారెడ్డి డివిజన్ పోస్టల్ ఎస్పీ డి. శ్రీహరి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పిల్లలలో ఫిలాటలీ పట్ల ఆసక్తిని పెంపొందించడం, స్టాంపుల సేకరణను ఒక హాబీగా ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. దీని కింద ఎంపికైన ప్రతి విద్యార్థికి త్రైమాసికానికి రూ. 1500/- చొప్పున ఏడాదికి రూ. 6000/- స్కాలర్‌షిప్ అందించబడునని తెలిపారు.
ఆసక్తి గల విద్యార్థులు తమ దరఖాస్తులను నిర్ణీత ఫార్మాట్ లో 15.09.2026 లోపు సంగారెడ్డి డివిజన్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ కార్యాలయానికి సమర్పించవలెననీ తెలిపారు. వెబ్ సైట్: https://www.indiapost.gov.in/sparsh-philately ద్వారా దరఖాస్తు ఫారం పొందవచ్చని వివరించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
దీన్ దయాల్ స్పర్శ స్కాలర్ షిప్ దరఖాస్తులకు ఆహ్వానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



