తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల ప్రతిభా కళాశాల (సిఈఓ), ధర్మారం-బి లో ఆదివారం టిఎస్ డ్లుఅర్ సీఈఓ సెట్-2024 టిఎస్ డ్లు అర్ సీఈఓ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో అడ్మిషన్ ల కొరకు) అనే ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్ష కేంద్రంకు మొత్తం 504 మంది విద్యార్థులను అలాట్ చేయగ 494 మంది హాజరుకాగా 10 మంది హాజరు కాలేదని, పరీక్ష ప్రశాంతంగా ముగుసిందని పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ బి. సంగీత ఒక ప్రకటనలో తెలిపారు.అదే విధంగా నిజామాబాద్ జిల్లా మొత్తంలో (6) పరీక్షా కెంద్రాలలో ఈ పరీక్ష నిర్వహించగ మొత్తం 2747 మంది విద్యార్థులకు గాను 2659 (97%) మంది ఈ పరీక్షకు హాజరు కాగా 88 (3%) మంది గైర్హాజరయ్యారని, జిల్లా మొత్తంలో ఈ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని జిల్లా సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాలయాల సమన్వయకర్త బి. సంగీత వివరించారు.ధర్మారం-బి పరీక్షా కేంద్రంలో పరీక్షా సజావుగా నిర్వహించడం కొరకు డిగ్రీ కళాశాల బాలికల ఆర్మూర్ ను నియమించారు.అర్సిఓ అలివేలు పరీక్షా కేంద్రంను సందర్శించి పరీక్షా నిర్వహణను పరిశీలించారు.