కారు జోరు.. 2 వందల మంది ప్రచారం

–  ప్రజా సేవలో తనదైన ముద్ర వేస్తున్న మంత్రి నిరంజన్ రెడ్డి.
–  గడప గడపకు కేసిఆర్ సంక్షేమ ఫలాలు.
– ఇంటి ఇంటికి మంత్రి నిరంజన్ రెడ్డి పాదయాత్ర.
– గౌరీ దేవి పల్లి లో ఇల్లు ఇల్లు తిరిగిన మంత్రి నిరంజన్ రెడ్డి సతీమణి వాసంతి
– అభివృద్ధి కార్యక్రమాలకు కేరాఫ్ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.
నవ తెలంగాణ- రేవల్లి :
మండలంలోని బీఆర్ఎస్ సీనియర్ నేతలు శివరాం రెడ్డి, శశిందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని రోజు రోజుకీ ముమ్మరం చేస్తున్నారు. శుక్రవారం గౌరీ దేవిపల్లి గ్రామంలో పల్లె నిద్ర చేసిన మంత్రి నిరంజన్ రెడ్డి సతీమణి వాసంతి ఉదయం నుంచి  శానాయిపల్లి గ్రామం, గౌరీదేవి పల్లి గ్రామాలలో గడప గడపకు తిరుగుతూ గులాబీ జెండా ప్రచార కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ ” మేనిఫెస్టో ” గురించి ప్రతి ఓటర్ కు వివరిస్తూ,  వనపర్తి నియోజకవర్గం లో గడిచిన 9 సంవత్సరాలలో జరిగిన అభివృద్ధిని చూసి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డిని అందరూ ఆదరించాలని, గత 60 ఏళ్లలో జరగని అభివృద్ధి కేవలం, ఈ 9 సంవత్సరాలలో గ్రామీణ ప్రాంత రోడ్లు, పట్టణ ప్రాంత రోడ్లు అభివృద్ధి చెందాయని అందుకు నిదర్శనం ప్రజల కండ్ల ముందే ఉందన్నారు. అంతే కాదు జిల్లాకు నూతన మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్, వ్యవసాయ, మత్స్య కళాశాలలు వచ్చాయని, తెలంగాణలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో వ్యవసాయానికి సాగు నీటి విషయంలో మరింత తోడ్పాటు అవుతుందని  చేసి చూపించిన ఘనత మంత్రి నిరంజన్ రెడ్డికి దక్కిందని అన్నారు. మంత్రి దగ్గరకు వచ్చి సమస్య చెప్పుకుంటే కాదు, తనే స్వయంగా ఆయా ప్రాంతాలకు వెళ్లి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని, వీలైతే అధికారులతో అక్కడే మాట్లాడి సమస్యలను పరిష్కరించడం ఆయన నైజం అని మాట్లాడారు. అంతేకాదు రోజుకు కనీసం 16 గంటలు ప్రజాక్షేత్రంలోనే ఉండటం ఆయన అలవాటు అందుకోసం పల్లెనిద్ర బస్తిబాట గడప గడపకు సందర్శన పేరిట ఎన్నో కార్యక్రమాలు రూపొందించి నిత్యం ప్రజల మధ్యనే ఉంటుంటారని అన్నారు. కెసిఆర్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ కారు గుర్తుపై ఓటు వేసి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు. వనపర్తి అభివృద్ధి జరగాలంటే మరోసారి వనపర్తి నియోజకవర్గం లో బీఆర్ఎస్ ప్రభుత్వం బలపరిచిన అభ్యర్థి మంత్రి నిరంజన్ రెడ్డిని గెలిపించుకుంటేనే అభివృద్ధి జరుగుతుందని ప్రజలకు వివరించారు.ఈ కార్యక్రమంలో గౌరీదేవి పల్లి సర్పంచ్ పార్వతమ్మ భర్త తిరుపతయ్య, సురేందర్ రెడ్డి, రామకృష్ణ, కృష్ణ, హరీష్, సుధాకర్, శానాయిపల్లి సర్పంచ్ లక్ష్మి, మధు, రేవల్లి మండలం ఎంపీపీ సేనాపతి, జడ్పిటిసి భీమయ్య, మాజీ ఎంపీపీ జానకిరామ్ రెడ్డి, బండరాయిపకుల సర్పంచ్ నారాయణ, ఉప సర్పంచ్ పూర్ణ కంటి కిరణ్, సలేశ్వరం, శ్రీరాములు, వాయిస్ ఎంపీపీ మధుసుధన్ రెడ్డి, నాగపూర్ సర్పంచ్ శ్రీనివాసులు, సింగిల్ విండో చైర్మన్ రఘు యాదవ్, చిర్కపల్లి సర్పంచ్ దొర్ల రాములు, ఎంపిటిసి శ్రీశైలం, నాగం తిరుపతిరెడ్డి, వేణు, కే రాములు, తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Spread the love