విత్తనాల కొనుగోల్లలో జాగ్రత్తలు పాటించాలి 

– మండలంలోని రైతులకు ఏఈఓల అవగాహన సదస్సులు 
నవతెలంగాణ – బెజ్జంకి 
ప్రభుత్వం నుండి అనుమతుల పొందిన దుకాణాల్లోనే రైతులు విత్తనాలను కొనుగోలు చేయాలని..కొనుగోలు చేసిన విత్తనాల రసీదు,విత్తనాల ప్యాకెట్లను పంట దిగుబడి చివరాంతరం వరకు భద్రపర్చాలని మండలంలోని ఏఈఓలు సూచించారు.సోమవారం మండల పరిధిలోనిదాచారం,ముత్తన్నపేట,రేగులపల్లి,కల్లెపల్లి, బేగంపేట,లక్ష్మీపూర్ గ్రామాల్లోని రైతులకు నాణ్యమైన విత్తనాల కొనుగోళ్లు,మోగి పురుగు ఉధృతి కట్టడి,వానకాలం పంటల సాగుకు అనువైన విత్తనాల రకాలపై ఏఈఓలు రేణుక శ్రీ,మౌనిక,రచన,భరత్ కుమార్,సాయి శంకర్ అవగాహన సదస్సులు నిర్వహించారు.అయా గ్రామాల రైతులు హజరయ్యారు.
Spread the love