- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ప్రధాని మోడీని దుర్భాలాషలాడినందుకు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్‌పై కేసు నమోదైంది. కొట్వాలి నగర్ పోలీస్ స్టేషన్‌లో బిజెపి కార్యకర్త నీరజ్ రావత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అజయ్ రాయ్‌పై శనివారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
కాగా, మే 22వ తేదీన సమద్ నగర్ ప్రాంతంలో మాజీ యుపి కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి బ్రిజ్‌రాజ్ అహిర్వార్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో అజయ్ రాయ్ పాల్గొన్నారు. ఆయన ఈ కార్యక్రమానికి 15 – 16 కాన్వాయ్‌లలో 25-30 మంది మద్దతుదారులతో వచ్చి రోడ్డును దిగ్భంధించి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించాని నీరజ్ రావత్ ఫిర్యాదు చేశారు.
- Advertisement -



