- Advertisement -
- దుబ్బాక సిఐ రాజేష్, ఎస్సై హరీష్
నవతెలంగాణ-మిరుదొడ్డి: నేరాలు అరికట్టడానికి సీసీ కెమెరాలు ఎంతో ప్రాముఖ్యతమని దుబ్బాక సీఐ రాజేష్, ఎస్సై హరీష్ లు అన్నారు.అక్బర్ పేట భూంపల్లి మండలం బేగంపేట గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎవరైనా అనుమానితులుగా కనబడితే వెంటనే పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని తెలిపారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వలన ఎవరైనా నిందితులను సులువుగా గుర్తించవచ్చని అన్నారు. నేరాలు అరికట్టడానికి ఎంతో ముఖ్యమన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చంద్రశేఖర్‌తో పాటు పాలకవర్గం, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
- Advertisement -



