ఉత్సాహంగా రైతు దినోత్సవ సంబురాలు

నవతెలంగాణ-న్యాల్‌కల్‌
రాష్ట్ర అవతరణ దశాబ్ది సంబురాలలో శనివారం మండలంలోని రైతు వేదికల్లో రైతు దినోత్సవ వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. న్యాల్‌క ల్‌, రేజింతల్‌, ముంగి, హద్నూర్‌, మావి ుడ్గి, హూసేల్లితో పాటు ఆయా రైతు వేదిక కస్టర్ల గ్రామాల నుంచి డప్పుచప్పుళ్ల మధ్య ట్రాక్టర్ల ఉరేగింపును నిర్వహిం చారు. ఆటాపాటలతో రైతులు, ప్రజాప్రతినిధులు, సర్పంచ్‌లు రైతుల వేధిక వద్దకు వచ్చి.. జాతీయ గీతాలాపన చేశారు. పలువురు అధికారులు మాట్లాడు తూ.. తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. దేశంలో రైతు లేనిదే రాజ్యం లేదన్నారు. దేశానికి రైతే అన్నదాత అన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్‌, రైతుబీమా, రైతుబంధు, మిషన్‌ కాకతీయ ద్వారా చెరువుల జలకళ తెచ్చి.. రైతులకు సీఎం కేసీఆర్‌ అండగా నిలుస్తున్నారన్నారు. ఈ ఉత్సవాల్లో మం డల జెడ్పీటీసీ స్వప్న కుమారి, ఎంపీపీ అంజమ్మ, ఎంపీపీ ఉపాధ్యక్షుడు గౌస్‌, మండల ఇంచార్జ్‌ తహసిల్దార్‌ మునిరోద్దీన్‌, స్పెషల్‌ ఆఫీసర్‌ రాఘవరావు, ఏఓ లావణ్య, ఏఈఓలు సన్నీత్‌ రెడ్డి, షరీఫ్‌, సాయిలు, సర్పంచులు కుతుభోదిన్‌, చంద్రప్ప, శివ శంకరయ్య స్వామి, అనిత, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love