ఎస్ఎఫ్ఐ రాష్ట్ర యూనివర్సిటీల కన్వెన్షన్ ను జయప్రదం చేయండి

నవతెలంగాణ –  డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ లో ఫిబ్రవరి 24, 25 తేదీలలో రాష్ట్ర యూనివర్సిటీ ల కన్వెన్షన్ నీ‌ విజయవంతం చేయాలని ఎస్ ఎఫ్ ఐ జిల్లా అద్యక్షులు రాచకొండ విఘ్నేష్ కోరారు. అదివారం తెలంగాణ యూనివర్సిటీ లో భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) తెలంగాణ యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో  ఆర్ట్స్ కళాశాల ముందు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాచకొండ విగ్నేష్ హాజరై మాట్లాడారు.యూనివర్సిటీ లో నిర్వహించేఎస్ ఎఫ్ ఐ రాష్ట్ర యూనివర్సిటీల కన్వేన్షన్ ను యూనివర్సిటీ లోని ఇంజనీరింగ్ బిల్డింగ్ సెమినార్ హాల్లో నిర్వహించడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కన్వెన్షన్ లో రాష్ట్ర యూనివర్సిటీల అభివృద్ధి పై ప్రధాన చర్చ ఉండబోతుందని పేర్కొన్నారు. ఈ కన్వెన్షన్ లో రాష్ట్ర యూనివర్సిటీల అభివృద్ధి పై ప్రధాన చర్చ ఉండబోతుందని వివరించారు. అదేవిధంగా నూతన జాతీయ విద్యా విధానం రద్దు చేయాలని పలు అంశాలు చర్చించనున్నమని,కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వాలు విద్యారంగానికి అధిక బడ్జెట్లను కేటాయించాలని, సకాలంలో యూనివర్సిటీ లలో ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలని, ప్రతి యూనివర్సిటీలో మౌలిక సదుపాయాల కల్పనను అందించేటట్టుగా ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలని, యూనివర్సిటీలో చదువుకున్న ప్రతి విద్యార్థికి ప్లేస్మెంట్స్ అందించాలనే అంశాల పైన, తెలంగాణలోని అన్ని యూనివర్సిటీలకు న్యాక్ అక్రిడియేషన్ కోసం పోరాటాలు, భవిష్యత్తు కార్యాచరణను రూపొందించడం కోసం ఈ యూనివర్సిటీల రాష్ట్ర కన్వెన్షన్ జరపడం ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ యూనివర్సిటీ కన్వెన్షన్ ను జయప్రదం చేయాలని ప్రతి ఒక్క విద్యార్థిని, మేధావులను కోరుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ యూనివర్సిటీ అధ్యక్షులు ప్రసాద్, రాష్ట్ర కమిటీ సభ్యురాలు సంధ్య రెడ్డి, యూనివర్సిటీ ఉపాధ్యక్షులు దినేశ్, పవన్, చరణ్ , శివ, చిత్రు, ప్రవీణ్ తదితర నాయకులు పాల్గొన్నారు.
Spread the love