
– కత్తులతో ఎదను బాదుకుంటూ..
– తమ రక్తాన్ని చిందిస్తూ…
– శియా ముస్లిం ల మతం ప్రదర్శన..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి షియా ముస్లిం సంఘం ఆధ్వర్యంలో బుధవారం మొహర్రం 10వ రోజు అశూరా పురస్కరిం చుకుని, మతం ప్రదర్శన నిర్వహించారు. ముహమ్మద్ ప్రవక్త మనువడు ఇమాం,హసన్,హుస్సేన్ బలిదానాన్ని స్మరిస్తూ మాతం ప్రదర్శన పట్టణంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. బుధవారం,మధ్యాహ్నం జంఖానా గూడెం లోని హజ్రత్ అబ్బాస్,పీర్ల చావడి నుంచి ఖాజీ,మోహిల్లా బీబీ కా ఆలం ఆశూర్ ఖానా వరకు,మాతం కొనసాగింది. మతం ప్రదర్శన ను మున్సిపల్ చైర్మన్ పోతాంశెట్టి వెంకటేశ్వర్లు, సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్ ప్రారంభించారు. రోజు, రాత్రి 8 గంటలకు హైదరాబాద్ చౌరస్తాలోని కర్బలా,మైదానం(సొంటే పీర్ దర్గా) నుంచి, ఖాజి మహేల్లా దర్గా,కమాన్ వద్ద ఉన్న షహజాదే,ఖాసిం పీర్ల చావడి వరకు మాతం ప్రదర్శన కొనసాగనుంది. ఈ మాతం ప్రదర్శనలో షియా ముస్లిం యువత కత్తులతో ఎదను బాదుకుంటూ,ఇమామ్ హసన్ హుస్సేన్,బలిదానాన్ని స్మరిస్తూ రక్తం చిందిస్తారు. షియా ముస్లిం మత,పెద్ద హాశిమ్,ఆరిఫ్ ధార్మికసందేశం ఇచ్చారు నోహా లను పటిస్తూ ఈ ప్రదర్శన కొనసాగింది. ఈ మాతం ప్రదర్శన లో ముస్లిం సంఘం జిల్లా అధ్యక్షుడు సయ్యద్ రజా హుస్సేన్, కార్యదర్శి,కల్బే హుస్సేన్, ప్రతినిధులు లాయక్ అలి,తఖీ హుస్సేన్,హైదర్ అలి,అస్గర్ అహ్మద్,సజ్జాద్ హుస్సేన్,అఘా మహేది,అద్నాన్ హుస్సేన్ లు పాల్గొన్నారు.